Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్‌నగర్‌లో ప్రగతి పుష్కలం
- జవహర్‌నగర్‌కు ఎంపీగా రెవంత్ రెడ్డి పైసా పనిచేయలేదు
- బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్
నవతెలంగాణ-జవహర్‌నగర్
అభివృద్ధి చేస్తున్న మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ చేసిన అనుచిత వాఖ్యాలు సరికాదని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే మాడిపోతారని... ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ పార్టీ జవహర్‌నగర్ మండల అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ హెచ్చరించారు. జవహర్ నగర్ తన గుండెకాయ అని చెప్పే మంత్రి ఇప్పటికే రూ.75కోట్లతో కనీవిని ఎరగని రీతిలో చేసిన అభివృద్ధితో జవహర్ నగర్ కార్పొరేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్యాయలం ముందు పార్టీ కార్య కర్తలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లా డారు. దేశంలో కాంగ్రెస్ కనుమరుగైందని, బీఆర్ఎస్ పార్టీనే దేశప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి జవహర్‌నగర్‌ను ఇసుమంతైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. నాయకుల మధ్య ఎల్లప్పుడు కొట్లాటలుండే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం సాయం చేస్తుందని.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీదరించు కుంటున్నారన్నారు. అనతి కాలంలోనే బీఆర్ఎస్ను దేశ ప్రజలు సాధారంగా స్వాగతిస్తూ... తెలంగాణలోని సంక్షేమ పథకాలు వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరుతుం డటంతో తెలంగాణ ఆత్మగౌరవం ఎల్లలు దాటిందని సగర్వంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలలో జవహర్‌నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, నేడు మంత్రి మల్లారెడ్డి జవహర్‌నగర్‌ను ఉద్యమస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అభివృద్ధి కోసం పరితపించే తమ మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్ గొడుగు వేణు, కోఆప్షన్ సభ్యురాలు శోభారెడ్డి, నాయకులు జిట్టా శ్రీనివాస్ రెడ్డి, మహేష్, ప్రకాష్, ప్రసాద్ గౌడ్, మాధవరెడ్డి, నర్సింహా, పౌలు, వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జీ పాషా, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.