Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సౌత్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్
- జియాగూడ కమేళాలో సీపీఐ(ఎం) సౌత్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర
నవతెలంగాణ-ధూల్ పేట్
జియాగూడ కమేళ ఆధునీకరణకు వత్తి సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్య పోరాట కార్యాచరణకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, సౌత్ జిల్లా కార్యదర్శి ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఆదివారం జియాగూడ కమేళాలో సీపీఐ(ఎం) సౌత్ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాద యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కమేల వత్తిదారులు, కార్మికులతో మాట్లాడారు. పలు కారణాలతో జియాగూడ కమేళా ఆధునీకరణ పనులు ముందుకు సాగటం లేదని కార్మికులు వాపో యారు. ఎండ కాలంలో దుబ్బ, దుమ్ము, ధూళితో, వర్ష కాలం లో బురదతో నిండి పోతుందని, తీవ్ర అసౌకర్యలతో ఇక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని సీపీఐ(ఎం) నాయకుల ముందు వారు వాపోయారు. ఈ సందర్భంగా ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ కమేళా ఆధునికరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగద న్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ కమేళాపై ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఆధునికర ణకు అన్ని రకాల నివేదికలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కమెళ ఆధునీకరణకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయించుకోవడం కోసం వత్తి సంఘాలు, కార్మిక సంఘాలు ఒక ఏకాభిప్రా యానికి వచ్చి పోరాట కార్యాచరణతో ముం దుకు వెళ్లాలన్నారు. తద్వారానే కమేళ ఆధునిక నిర్మాణం జీ హెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరిగేలా సాధించుకొగలమని పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో జియాగూడ కమేళ స్థానిక నాయకులు వి. ప్రమోద్ కుమార్, చుక్క నర్సింహ, శారదా బాయి, శ్రీశైలం, ఎస్.మల్లేష్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జి.విఠల్, పి. నాగేశ్వర్, శశికళ, కోటయ్య, జంగయ్య, కిషన్, కళ్యాణ్, కార్యకర్తలు సత్యమ్మ, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.