Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరికలు
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్పేట
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో జరుగు తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతు న్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున బాగ్ అంబర ్పేట డివిజన్ సాయిమధురానగర్కు చెందిన జమ్మిచెట్టు బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలరాజుతో పాటు మరో వంద మంది స్థానికులు, మహిళలు కూడా బీజేపీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీలో కొన్నేండ్లుగా పని చేస్తున్న వారు నిరాశతో బయటకు వచ్చి తమ బస్తీలు, కాలనీలను అభివద్ధి చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో 15 ఏండ్లు ఎమ్మెల్యేగా, మూడేండ్లుగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న జి.కిషన్ రెడ్డి తనకు మెజార్టీని ఇచ్చిన అంబర్ పేటను పూర్తిగా విస్మరించారన్నారు. తన ఎంపీ నిధులను ఖర్చు చేయకపోవడంతో అవి మురిగి పోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చెందిన పదికోట్ల నిధులు మురిగిపోవడానికి వచ్చాయని, తన పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. సాయిమధురానగర్లో స్థానికుల కోరిక మేరకు ఒక కమ్యూనిటీహాల్ ను కట్టిస్తానని చెప్పారు. అలాగే మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి ఏదైనా ఉపాధి శిక్షణ పొందుతామంటే వారికి తగిన సహకారం అందజేస్తానని పేర్కొన్నారు. కుట్టు మిషన్లు వంటివి ఇప్పిస్తానని తెలిపారు. బస్తీలో ఏ సమస్య ఉన్నా తన దష్టికి తీసుకురావాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఎ. రాములు, ఎం.రాజు, కె. రాజు, టీవీ శేఖర్, శ్రావణ్, దుద్యాల శివ, తిరుమని వెంకట్, మురళీ, శేఖర్, సందీప్, ప్రణరు, గురు, అరవింద్, ప్రసాద్, కుమార్, మల్లేష్, వెంకటచారి, కష్ణ, మహిళలు వేదవతి, మీనా, రేఖ, వరలక్ష్మి, ధనలక్ష్మి, రూప, రోహిణి, పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు రవీందర్రావు, కోట్ల సంతోష్, రమేష్ నాయక్, మిర్యాల రవీందర్, అరుణ్ కుమార్ రెడ్డి, సి.మల్లేష్ యాదవ్, శివాజీయాదవ్, బి.నర్సింగ్రావుయాదవ్, కె.ఎస్. ధనుంజయ, విజయ్, సునీల్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.