Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి అనురాధ
నవతెలంగాణ-అడిక్‌మెట్
మహిళల హక్కులు, స్త్రీ పురుష సమానత్వానికి పోరాడుదాం అని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి అనురాధ తెలిపారు. ఆదివారం విద్యానగర్‌లోని చంద్ర పుల్లారెడ్డి భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం హైదరా బాద్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రగశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు 7,8 లలో మహబూబాబాద్‌లో జరుగుతున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల గోడపత్రికను ఆదివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీలో సైతం మహిళా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రిజర్వేషన్ బిల్లు 30 ఏండ్లుగా పార్లమెంటులో ఆమోదానికి నోచుకోవడం లేదన్నారు. ఆత్మగౌరవం కోసం స్త్రీ,పురుష సమానత్వం కోసం జరిగే ఉద్యమాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఇందుకు మహబూబాబాద్‌లో జరుగుతున్న రాష్ట్ర మహాస భలలో చర్చించి తగిన కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సరళ, ప్రధాన కార్యదర్శి భారతి, ఉపాధ్యక్షురాలు బండారు విజయ, జిల్లా నాయకురాలు రేణుక పాల్గొన్నారు.