Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమేగా హాస్పిటల్స్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ వంశీ
- గచ్చిబౌలిలో ఒమేగా ఆస్పత్రి మల్టీ- స్పెషాలిటీ బ్రాంచ్ ప్రారంభం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
క్యాన్సర్ చికిత్సలో అగ్రగామిగా నిలిచిన ఒమేగా హాస్పిటల్స్ నూతన బ్రాంచ్ ప్రపంచస్థాయి సదుపా యాలతో, అత్యంత అధునాతన టెక్నాలజీతో 500కు పైగా పడకల సామర్థ్యంతో ఆదివారం గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ వంశీ మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు అందించాలని, ఏకైక లక్ష్యంతో గచ్చిబౌలిలో ఒమేగా ఆస్పత్రిని అందుబాటులోనికి తెచ్చామన్నారు. క్యాన్సర్తో బాధపడు తున్న చాలామంది రోగులకు గుండె, ఆర్థోపెటిక్, మూత్రపి ండం, పల్మనది, న్యూరోలాజికల్ సమస్యలకు డిసిప్లినరీ కేర్ అవసరమని, రోగుల సంరక్షణ దష్టిలో ఉంచుకొని తాము సమగ్ర క్యాన్సర్ సంరక్షణను అందించడానికి, వివిధ సూపర్ స్పెషాలిటీల సేవలను ఐదు అంతస్తులలో అందుబాటులోకి తెచ్చామని అన్నారు. వైద్య రంగంలో వేగంగా అభివద్ధి చెందుతున్న సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం ఎంతో అవసరం అన్నారు. ఒమేగా హాస్పిటల్స్ లో భారత దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రేడియేషన్ మిషన్ ,ఎతోస్ విప్లవాత్మకమైన కొత్త తెరపిని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇది రోగి కేంద్రీకతంగా పనిచేస్తుందని వివరించారు. చికిత్సకు సంబంధించి ప్రారంభ ప్రణాళిక నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్సీ తో ,పనిచేసే ఎథోన్ని ఉపయోగించి, పెట్జ/ఎంఆర్-గైడెడ్ అడాప్టీవ్ రేడియో థెరపీని ప్రారంభించామని వెల్లడించారు. ఇది క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవం అని పేర్కొన్నారు. ఈ విధానంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి చూడటం, ఆలోచించడం, ప్లాన్ చేయడం, చికిత్స అందించటం పూర్తి చేయవచ్చని వివరించారు. భారతదేశంలో డిజిటల్ పెట్, ఎంఆర్ డిజిటల్, పెట్ సిటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్, మెడిసిన్ డిపార్ట్మెంట్ను ప్రారంభించిన మొదటి ఆస్పత్రి ఒమేగా హాస్పిటల్ అని డాక్టర్ మోహన్ వంశి పేర్కొన్నారు. మ్యాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసియు, హై అండ్ క్యాట్ ల్యాబ్ ఫెసిలిటీస్ తో తమ అనుభవజ్ఞులైన క్రిటికల్ కేర్ టీం 24 గంటలు అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటారన్నారు.