Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో బ్యానర్ పై సంతకాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
40 నెంబర్ బస్సును పాత రూట్లోనే నడపాలని కోరుతూ హైదరాబాద్ జిందా బాద్ కవాడిగూడ బోలాపూర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివా రం బ్యానర్ పై సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు నాలుగు వైపుల దారిని యూటర్న్‌గా మార్చినందున 40 నెంబర్ బస్సు అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ చౌరస్తా ద్వారా వెళుతున్న దని... దానివలన వందలాదిమంది ప్రయాణికులకు అదనంగా పది నిమిషాలు చొప్పున సమయం పడుతున్నదని.. అలాగే అశోక నగర్ కాలనీ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకుండా పోతున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ నగర సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర జీవనంలో ట్రాఫిక్ ప్రాధాన్యతల రీత్యా ఫుట్ పాత్ పాదచారులకు, ప్రజా రవాణాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం నగరంలో ఏకైక రవాణా సాధనం ఆర్టీసీ బస్సు మాత్రమే నని, 40 నెంబర్ ఆర్టీసీ బస్సు ప్రయాణానికి అశోక్ నగర్ చౌరస్తాలోని యూ టర్న్ అంతరాయంగా మారిందని అన్నారు. యూ టర్న్‌ను తొలగించి 40 వ నంబర్ బస్సు పాత రూట్ లోనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం ప్రయాణించే ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వవల సిందిగా ట్రాఫిక్ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. బస్తీ వాసులు బ్యానర్‌పై సంతకాలు చేసి తమ నిరసన చేశారు పాత రోడ్ లోనే బస్సులు నడవాలని అశోక్ నగర్ చౌరస్తాలో యూటర్న్ రద్దు చేయాలని నినాదాలు ఇచ్చారు. కార్యక్రమానికి హైదరాబాద్ జిందాబాద్ కవాడిగుడ - భోలక్ పూర్ డివిజన్ కార్యదర్శి మోహన్ నగర ఉపాధ్యక్షులు ఆర్. ఈశ్వర్ బాబు,శ్రీనివాస్ నాయకత్వం వహించారు.