Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
నవతెలంగాణ-ఎల్బీనగర్
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా, ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు జరిపాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం 'కంటి వెలుగు' అని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం సోమవారం ఎల్.బి. నగర్ లింగోజిగూడలో నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడు తు మన ఇంటి వద్దకే మన ఆరోగ్యం అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 100 రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేయనున్నారు. అవసరం ఉన్నవారికి కళ్లద్దాలు అందేవిధంగా ఏమైనా ఇబ్బంది ఉంటే కళ్ళకు ఆపరేషన్ కూడా చేయించి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరిస్తుంది అన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ప్రపంచంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు నిర్వహించలేదని, ముందుచూపుతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. పక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొదలు పెట్ట్టే ఆలోచనలో ఉన్నాయని అన్నారు. రోజుకి ఒక్కో క్యాంప్ ద్వారా 150 నుండి 200 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.