Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
దివ్యాంగుడి జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్ వారు చేయూతను అందించారు. పోచారం మున్సిపల్ అన్నోజిగూడ వికలాంగుల కాలనీకి చెందిన వికలాంగుడు జాన్‌కి జీవనోపాధి కల్పించేందుకు శ్రీరాజమాత ఫౌండేషన్ అధ్యక్షులు ఉదరురెడ్డి ముందుకు వచ్చి దాతల సహకారం తో రూ.16వేల విలువ చేయు దుకాణ సముదాయపు సామాగ్రిని అందజేసి షాపును ఏర్పాటు చేయించారు. ఆదివారం శ్రీరాజమాత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉదరు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి రాజమాత ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తు న్నట్లు తెలిపారు. కరోనా వ్యాపించిన నాటి నుండి వికలాంగుల కాలనీలో సామాజిక సేవలు చేస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకు నూతన వస్త్రాల పంపిణీ, స్వయం ఉపాధి కోసం వితంతు మహిళలకు కుట్టుమిషన్లు, పేద విద్యార్థికి ఫీజు కట్టడం జరిగిందని, అలాగే పేద ప్రజలకు వారంలో 4 రోజులు అన్నదానం, 3 రోజులు టిఫిన్ డ్రైవ్, ప్రతిరోజు రాజమాత ఫౌండేషన్ ద్వారా సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు శ్రీరాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని నిర్వహిస్తూ ముందుకు వెళతామని పేర్కొన్నారు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు వికలాంగుడి జీవనోపాధికి షాపును ఏర్పాటు చేయించి ప్రారంభిస్తున్న రాజమాత ఫౌండేషన్ అధ్యక్షులు ఉదరురెడ్డి సహకరిస్తున్న దాతలకు ఈ సంద ర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఉదరు రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షు లు మనోజ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు అంజలి, ప్రీతి, శృతి, పండు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.