Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకటరమణ రెడ్డి
- వనస్థలిపురంలో రెండు కోట్ల రూపాయలతో అధునాతన గ్రంథాలయం
నవతెలంగాణ-వనస్థలిపురం
జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా జిల్లాలో గ్రంథాలయాల సందర్శనకు శ్రీకారం చుట్టారు. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మనోజ్ కుమార్‌తో కలిసి సోమవారం వనస్థలిపురం, సరూర్‌నగర్ శాఖ గ్రంథాలయాలను సందర్శించారు. గ్రంథాలయాల్లో వసతులను పరిశీలించి పాఠకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచనల మేరకు వనస్థలిపురం శాఖ గ్రంథాలయానికి రెండు కోట్ల వ్యయంతో అధునాతన నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. సకల వసతులతో ఈ భవనాన్ని నిర్మించి త్వరితగతిన అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో 9 కోట్లతో నిర్మాణం చేపడుతున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరిన్ని భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమ వుతున్న అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులోకి ఉంచామని, ఆన్ డిమాండ్ బుక్స్ కొనడానికి సంసిద్ధంగా ఉన్నామని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకులు పద్మ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.