Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఫిబ్రవరి11న జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని విజవంతం చేయడం కోసం తన నివాసంలో సుధీర్‌రెడ్డి పలువురు జీహెచ్ఎంసి మరియు పోలీస్ ఉన్నత అధికారులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వచ్చిన అభ్యర్థులకు మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా చూడాలని కోరారు. దాదాపుగా 20వేల మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ మరియు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే దాదాపుగా ఆన్లైన్లో ఆరు వేల మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది అని తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా శానిటేషన్ మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జాబ్ మేళా రోజు ఇంటర్వ్యూలు సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో లైటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్ రెడ్డి, ఎల్.బి.నగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ఎల్.బీ.నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డీ.సీ.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.