Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని స్ధానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. కాలనీవాసుల వినతి మేరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మేనేజర్ మేధతో కలిసి పార్కును పర్యవేక్షిం చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్కు ఆధునికీకరణతో పాటు కాలనీలలో వున్న మౌలిక సమస్యలను పరిష్కరిస్తామని వారికి లచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రధాన కార్యదర్శి పద్మా రెడ్డి, చంద్రయ్య, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సికిందర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, సురేందర్‌రెడ్డి, జంగయ్య, వెంకట్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.