Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- హత్ సే హత్ జోడో యాత్రకు జననీరాజనం
- ఘటకేసర్లో రేవంత్‌కు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
- భారీగా ఏర్పాట్లు చేసిన టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనను భూస్థాపితం చేసి ఇందిరమ్మ రాజ్యం సాధించేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషిచేయాలని టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల నుంచి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నాడు రోడ్డు మార్గంలో ములుగు బయలుదేరిన రేవంత్ రెడ్డికి ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్, టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. ఈ సందర్భం గా వజ్రెష్ యాదవ్ రూపొందించిన భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలో చేసిన పాపాలకు లెక్కలతో సహా కక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. హత్ సే హాత్ జోడో యాత్రతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా బుద్ధి చేప్పేలా ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి, గ్రేటర్ హైదరాబాదు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మచ్చ వరలక్ష్మి, కార్పొరేటర్ తోటకూర అజరు యాదవ్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ మల్కాజిగిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరిత, ఘటకేసర్ వైస్ ఎంపీపీ కర్రే జంగమ్మ లతోపాటు ఉమ్మడి ఘటకేసర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.