Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బట్టెల్ గుట్ట పార్కు ప్రజలకు అంకితం ఎంతో అవసరం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్‌పేట్‌లోని బట్టెల్ గుట్టను ప్రజలకు అంకితం చేయటం జరిగిందని అక్కడ రూ.1కోటి 20లక్షల నిధులతో చేపట్టిన పార్కు ప్రజల మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌లోని మేయర్ పారిజాత నర్శిహ్మరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్, స్థానిక కార్పొరేటర్ బిమిది స్వప్న జంగారెడ్డితో కలిసి ఎంతో పురాతనమైన బట్టేల్ గుట్టను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పార్కును ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అంకితం చేయటం జరిగిందని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మానసిక ప్రశాంతతకు కోట్లాది రూపాయల నిధులతో చెరువులను సుందరీకరణ చేయటం జరుగుతుందన్నారు. అనంతరం గాంధీ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ రామాంజ నేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అదేవిధంగా నాదర్గుల్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి శోభ ఆనంద్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అర్జున్, రాళ్లగుడం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, లిక్కి మమత కృష్ణారెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, వై.రాంరెడ్డి, బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, ఎం.లలిత కృష్ణ,పి.సుదర్శన్‌రెడ్డి, తోట శ్రీధర్ రెడ్డి, ఇంద్రసేన, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, మనోహర్, కోఆప్షన్ సభ్యులు సమైక్య జ్యోతి అశోక్, డిఈఈలు అశోక్ రెడ్డి, జ్యోతి, ఏఈ రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు.