Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
కంటి సమస్యలు ఉన్న వారు కంటి వెలుగు శిబిరాన్ని సద్విని యోగం చేసుకోవాలి అని నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తప ల్లి మీనా ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ పరిధి లోని జెజె నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలు గు కార్యక్రమన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకుని రావాలని సూచించారు. కంటి వైద్యులు కండ్లను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను ఇస్తారని చెప్పారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఇక్కడ ఉచితంగా చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేం దర్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఆర్ ప్రసాద్, శివ,రాజు, మహేష్, రాజేష్, మధుసూదన్ రెడ్డి, సాయి గౌడ్, నవీన్, కిషోర్, శ్యామ్ ప్రసాద్, వైద్యులు పాల్గొన్నారు.