Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ అమోరు కుమార్
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమనీ, ఈ విషయంలో వారు ఏ ప్రాంతానికి బదిలీపై వెళ్ళినా తమకంటూ ఒక గుర్తింపును, మంచి పేరు సంపాదించుకోవాలనీ, ఈ విష యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వ హించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్ళిన హరీశ్ తనకు సోదర సమానులనీ, తాము రంగారెడ్డి జిల్లాలో కలిసి పని చేశా మని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ అమోరు కుమా ర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతన కలెక్టర్ అమోరు కుమార్ కు స్వాగతం, బదిలీపై వెళ్ళి కలెక్టర్ హరీశ్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోరు కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదిన్నర పాటు విధులు నిర్వహించి మరింత అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చిన ఘనత హరీశ్ కు దక్కుతుందన్నారు. ఈ విషయంలో తాము రంగారెడ్డి జిల్లాలో కలిసి పని చేశామని ఆయన తెలిపారు. హరీశ్ అన్ని రంగాల్లో మంచి పట్టు, బాధ్యత కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించారనీ, ఆయన జిల్లాకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుంటాయని కొని యాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించి న ఆయన బదిలీపై వెళ్ళారని అయినప్పటికీ ఆయన సహకారం జిల్లాకు తీసుకుంటామన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్ళిన హరీశ్ మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో తాను 18 నెలల పాటు బాధ్యతలు నిర్వహించాననీ, ఎంతో ఆనందంగా అందరు అధికారులతో కలిసి మెలసి పని చేసేవారమని గుర్తు చేశారు. జిల్లాలో తాను పని చేసిన సమయంలో అన్ని శాఖల అధి కారులు, సిబ్బంది ఎంతో సహకరించారనీ, వారి సహకారం ఎప్పటికీ మరువలేనిదని హరీశ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ధరణి, జీవో 58, 59 విషయాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేసి ఏమాత్రం పెండింగ్ లేకుండా చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని తెలిపారు. కరోనా సమయంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని వివరించారు. ప్రస్తుతం జిల్లాకు కలెక్టర్గా బదిలీపై వచ్చిన అమోరు కుమార్ సమర్ధవం తమైన వారనీ, ఆయన హయాంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పడంలో ఏమా త్రం సంకోచంలేదన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లు అమోరు కుమార్, హరీశ్ రాష్ట్రంలోనే చురుకైన అధికారులుగా మంచి పేరు సంపాదించారనీ, వీరి ఆధ్వ ర్యంలో రెండు జిల్లాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆకాం క్షించారు. పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ హరీశ్ చేసిన పనులను గుర్తు చేస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఇద్దరు కలెక్టర్లను కీసరగుట్ట నుంచి వచ్చిన వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు పూలమాల లు, శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవె న్యూ అధికారి లింగ్యానాయక్, టీజీఓ అధ్యక్షుడు, డీసీఓ శ్రీనివాస్ మూర్తి, ట్రెస్మా జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.