Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశిం చారు. సోమవారం రాంగోపాల్ పేట డివిజన్లోని ఓల్డ్ గ్యాస్ మంచి, మేకల బండ ప్రాంతాల్లో మంత్రి వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సంద ర్భంగా ఓల్డ్ గ్యాస్ మండి లోని శ్రీ ఉప్పలమ్మ ఆలయం వద్ద రూ.45 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులు అసంపూ ర్తిగా ఉండటం చూసి మిగిలిన రోడ్డు పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయం పక్కన ఉన్న వ్యర్ధాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మంత్రి తన వ్యక్తిగత నిధులతో పునర్నిర్మిస్తున్న ఉప్పలమ్మ ఆలయాన్ని కూడా సందర్శించారు. అనంతరం మేకలబం డ కమ్యూనిటీ హాల్‌ను స్ధానిక ప్రజల విజ్ఞప్తి మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్లో టాయిలెట్స్ మరమ్మతులు చేయాలనీ, ప్రహరీ గోడ మర మ్మతులు చేపట్టాలని కోరారు. వెంటనే చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ, ముకుంద రెడ్డి, సుదర్శన్, శానిటేషన్ శ్రీనివాస్, తహసీల్దార్ శైలజ, నాయకులు అత్తిలి మల్లిఖార్జున్, మనోజ్, కాలనీకి చెందిన జగన్, మహేష్ గౌడ్, వినరు, తదితరులు ఉన్నారు.