Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
- ప్రజావాణికి 76 ఫిర్యాదులు
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మంది రంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమ స్యలు తీరుతాయని ఎంతో నమ్మకంతో దూర ప్రాంతాల నుంచి వస్తారనీ, దీన్ని దష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీలైనంత వరకు ఎప్పటి సమస్య లకు సంబంధించి పరిష్కారాలు అప్పటికప్పుడు పరిష్కరిం చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 76 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల వారికి వాటిని అందచేసి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.