Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రమాదానికి గురై అకాల మృతి చెందిన కార్వాన్ -1 యూపీహెచ్సీ ఆశా వర్కర్ బి.వీణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) హైదరాబాధ్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.మీన డిమాండ్ చేశారు. పేద కుటుంబానికి వీణ కంటి వెలుగు విధి నిర్వహణకు బయలుదేరి వస్తుండగా మార్గమధ్యలో యాక్సి డెంట్‌కు గురై చనిపోయింది. కార్వాన్ అమ్లపూర్లోని ఆమె స్వగ హానికి ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) సౌత్ కమిటీ నాయకులు విషయాన్ని తెలుసుకుని చేరుకుని వీణ మృతదేహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. గోల్కొండ క్లస్టర్ ఎస్పీహెచ్ఓ అనురాధ, మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్‌లను కలిసి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ స్కీం అమలు చేయాలనీ, బెస్ట్ ఆశా వర్కర్‌గా గుర్తింపు పొందిన బి.వీణకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరో రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. వీణ అంత్యక్రియలకు సీఐటీయూ హైదరబాద్ సౌత్ జిల్లా నాయకులు కే.జంగయ్య, పి.నాగేశ్వర్, పి.కళ్యాణ్, సహచర ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో హాజరయ్యారు.