Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
గోల్నాక డివిజన్లోని శాంతినగర్లో రూ.6 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న డ్రయి నేజీ పైపు లైను పనులను మంగళవారం అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన బస్తీల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. స్థానికంగా గల ప్రభుత్వ పాఠశాలను సంద ర్శించి విద్యార్థులు ఉపాధ్యాయులను అడిగి అక్కడి సమ స్యలను తెలుసుకున్నారు. కొత్త భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో డ్రయినేజీ, మంచినీటి నూతన వ్యవస్థను రూపొందిస్తున్న ట్టు తెలిపారు. ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.