Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జాతీయస్థాయి ఓపెన్ కరాటే కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ (సీఎం కేసీఆర్ మెగా కప్ 2023) రుద్రమదేవి షోటోకాన్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో, నగరంలోని ఎల్బీ స్టేడియం (ఇండోర్ స్టేడియం)లో నిర్వహించిన కరాటే కుంగ్ ఫు ఆర్గనైజర్లు పోటీలలో కూకట్పల్లి, జగద్గిరిగుట్ట సమీపంలోని పాపిరెడ్డి నగర్లో గల రాజధాని పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ప్రతిభ కనబరిచారు. ముగ్గురు విద్యార్థినులు ప్రథమ బహుమతి, ఇద్దరు విద్యార్థులు ద్వితీయ బహుమతి, మరో ఇద్దరు విద్యార్థులు తృతీయ బహుమతితో సత్తా చాటారు. విజేతలుగా నిలిచిన వారిని ప్రముఖ సినీ నటులు సుమన్ తల్వార్, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్లు డాక్టర్ వి.రవి, ఎన్.లక్ష్మి సౌమ్రాజ్యం, చేతుల మీదుగా మూడు స్వర్ణ, రెండు రజిత, రెండు కాంస్య బహుమతులు వారికి అందజేశారు. అనంతరం మంగళవారం పాఠశాల క్యాంపస్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల చైర్మెన్, కరస్పాండెంట్ యాద నరేంద్ర, ప్రిన్సిపల్ యాద రేణుక. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులతో కలిసి ప్రత్యేకంగా అభినందించారు. విద్యతోపాటు క్రీడల్లో రాణించి దేశ ప్రతిష్ట ఇనుమడింప చేయాలని వారిని ఆకాంక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యతోపాటు శాస్త్ర ,సాంకేతిక ,క్రీడ రంగాల్లో తమ విద్యార్థులకు అన్ని విధాలుగా శిక్షణ ఇస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామన్నారు. కరాటే మాస్టర్, అకాడమీ చీఫ్ కోచ్, తెలంగాణ రిప్రజెంటర్, బీమా ఉదరుకుమార్ ఆధ్వర్యంలో తమ విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు నరేష్, సాయి, శ్రీరామ్, మల్లేష్ పాల్గొన్నారు.