Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ రెక్టర్ పోస్టులు తెలంగాణ ప్రొఫెసర్స్కే ఇవ్వాలని జేఎన్టీయూ హెచ్ విద్యార్థి సంఘాల నాయకులు కోరుతూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయిన్పల్లి వినోద్ కుమార్‌ను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు ఎరవెల్లి జగన్, లకావత్ భానుప్రకాష్ నాయక్‌లు మాట్లాడుతూ యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు గురించి, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీలో తెలంగాణ సీనియర్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్‌కు జరుగుతున్న అన్యాయం గురించి, యూనివర్సిటీలో 13 డైరెక్టర్లు ఉంటే అందులో 9 డైరెక్టర్స్ నాన్ తెలంగాణ వాళ్లకు ఇవ్వడం జరిగిందన్నారు. యూనివర్సిటీ కాలేజ్‌లో ఏడు ప్రిన్సిపల్స్ ఉంటే అందులో నాలుగు నాన్ తెలంగాణ వాళ్లకు ఇవ్వడం జరిగిందన్నారు. కీలకమైన పోస్టులు అన్ని నాన్ తెలంగాణ వాళ్లకు ఇవ్వడం జరిగిందని, నాన్ తెలంగాణ ఒకే వ్యక్తికి రెండు డైరెక్టర్ పదవులు, మరో నాన్ తెలంగాణ ప్రొఫెసర్‌కి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్స్ ఆంధ్రప్రదేశ్‌లో వైస్‌చాన్సలర్ ఉన్నత విద్యామండలిలో ఇతర ఉన్నత పదవులు అవకాశం వస్తున్నాయన్నారు. డైరెక్టర్స్, మిగతా అడ్మనిస్ట్రేటివ్ పోస్టులలో తెలంగాణ-నాన్తెలంగాణ ప్రొఫెసర్స్ అందరికీ సమ న్యాయం చేయాలన్నారు. యూనివర్సిటీ రెక్టర్‌గా నాన్ తెలంగాణ ప్రొఫెసర్‌కి ఇవ్వాలి అని ప్రతిపాదన చేయడం జరుగుతుందని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ స్పందించి అందరికీ సమన్యాయం చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.