Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఓ వైపు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై ప్రతి నెల నాలుగైదు రోజులు పాదయాత్ర చేస్తూ సంబంధిత అధికారులను, స్థానిక బీఆర్ఎస్ నాయకులను తన వెంట బెట్టుకుని డివిజన్లోని ప్రతి బస్తీ, కాలనీలో తిరుగుతూ స్వయంగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపడుతు న్నామని, కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మాత్రమే పాదయాత్రలు చేపడతారని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి పక్ష పార్టీ వాళ్లకు ఎన్నికలు సమీపిస్తున్నపడు మాత్రమే ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయని, మేము ఎప్పుడూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే అరికేెపూడి గాంధీ సహకారంతో డివిజన్లో ఇప్పటికే 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ ద్వారా సమస్యల పరిష్కారం
దొడ్ల రామకృష్ణ గౌడ్
ఇదిలా ఉంటే కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు, యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్ గత కొన్ని రోజులుగా 'గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ' కార్యక్రమం పేరిట స్థానిక నాయకులతో కలిసి డివిజన్ వ్యాప్తంగా సమస్యల పరిష్కారం దిశగా ప్రతిరోజు 'గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ' కార్యక్రమంలో బస్తీలు, కాలనీలు తిరుగుతూ స్థానికుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ల సహాయ సహకారాలతో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించడమే లక్ష్యంగా స్థానికుల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు.
పరిష్కారం కాని సమస్యలు అనేకం
అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరింపజేస్తాం
బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ సురభి రవీందర్రావు
గత 13 రోజులుగా డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకోవ డానికి పాదయాత్ర చేస్తున్న సురభి రవీందర్ రావు మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ డివిజన్ వ్యాప్తంగా, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి డివిజన్లోని ప్రతి బస్తీలో గత 13 రోజులుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ పాదయాత్రలో ప్రజల యొక్క అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని సురభి రవీందర్రావు తెలియజేశారు. అందులో భాగంగా ముఖ్యంగా మంచి నీటి సమస్య, కొన్ని బస్తీల్లో మంచి నీటిని తక్కువ సమయం వదలడం, కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి ప్రెజర్ తక్కువగా ఉండటం వల్ల మంచి నీటి సమస్యలు స్థానిక మహిళలు పరిష్కరించాలని కోరారని, అలాగే కొన్ని బస్తీలలో విద్యుత్ స్తంభాలు సరిగ్గా లేవని, రోడ్లు, డ్రయినేజీ, ఇలాంటి అనేకమైన సమస్యలు మా పాదయాత్రలో భాగంగా మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి, ఈ సమస్యల్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తున్నామని, అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే బీజేపీ నాయకుల మందరం సంబంధిత కార్యాలయాల వద్దకు వెళ్లి అధికారులతో చర్చించి పరిష్కారమయ్యేలా మా కార్యాచరణ ఉంటుందని సురభి రవీందర్ రావు తెలిపారు.