Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో బీసీ కులస్తులు చేసిన త్యాగాలను దృష్టిలో పెట్టుకొని బీసీ కులాల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, పశుసంవర్ధక శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలవారికి నిర్మిస్తున్న ఆత్మ గౌరవ భవనాలలో భాగంగా మంగళవారం రాజేంద్రనగర్ నియోజక వర్గం, నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని కోకాపేటలో భట్రాజు కుల సంఘ భవన భూమి పూజ కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వాలు బీసీ కులాలను విస్మరించాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన 9 ఏళ్లలో బీసీ కులాలకు అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ ఫలాలు అందజేశారని గుర్తుచేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షులు కూరపాటి కరుణాకర్ రాజు, ప్రధాన కార్యదర్శి లోలబట్టు కృష్ణంరాజులు మాట్లాడుతు ఈ భవన నిర్మాణానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి తమ సంఘానికి సహాయ సహకారాలు అందించినందుకు భట్రాజు సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలయ జేశారు. రాష్ట్ర అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు, ప్రధాన కార్యదర్శి ప్రతి కంఠం పూర్ణచందర్ రాజులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తమ భట్రాజు కుల సంఘ భవనం కోసం స్థలం కేటాయించినందుకు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సరస్వతి రామరాజు, యువజన సంఘం అధ్యక్షులు బొల్లెపల్లి సీతారామరాజు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తంగెళ్ళరాధాకృష్ణరాజు, రేవతినంద్, తంగేళ్ళ సుజాత, పరమేశ్వరి, సావిత్రి, అశోక్ రాజు, చక్రహరి శ్రీనివాసరాజు, మేడ్చల్ జిల్లా ప్రచార కార్యదర్శి సరస్వతి నరేందర్ రాజు, భాస్కర్ని నరేందర్ రాజు, మురళీకృష్ణంరాజు, ఈలపంటి నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.