Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-ఓయూ
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లు చేస్తానని హామినిచ్చి అధికారంలోకి వచ్చిన మోడీ 9 ఏండ్లు గడిచినా హామీలు అమలుకు నోచుకోక పోవడానికి నిరసనగా ఈ నెల 13వ తేదీన హైదరా బాద్-విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధనం చేయనున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం పార్సిగుట్టలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారుల దిగ్బంధనంను విజయప్రదం చేయాల్సిన బాధ్యత మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉందన్నారు. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ సమక్షంలోనే హామీనిచ్చారనీ, పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. వర్గీకరణ లేకపోవడం విద్యా, ఉద్యోగ అవకాశాలను వేల సంఖ్యలో కోల్పోతున్నామ న్నారు.తమ ఆకాంక్షలను, ఆవేదనలను అర్థం చేసుకోలేక పోతున్నారనీ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడుతున్నామని తెలిపారు. మోడీ హైదరాబాద్కు ఎప్పుడు వచ్చినా వర్గీకరణ అంశం తేల్చాల్సిందే అనీ, తమ ఆవేదనను అర్థం చేసుకోకపోతే తెలంగాణ గడ్డకు ఎప్పుడు వచ్చినా ప్రధాని ప్రజల ప్రతిఘ టన చవిచూడాల్సిందే అని హెచ్చరించారు. వర్గీకరణ వల్ల ఒక్క రూపాయి కూడా అదనంగా భారం కాదనీ, ఎస్సీ వర్గీకరణ కోసం అనేక సార్లు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పండిత్ దీన్ దయాల్ ను కూడా విస్మరించినట్టే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ తీసుకురాకపోతే ఖచ్చితంగా బీజేపీ నాయ కులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేస్తే ఎమ్మార్పీఎస్ శ్రేణులపై బీజేపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గం అన్నారు. బీజేపీ నాయకులు రౌడీలుగా మారితే తాము కూడా ప్రతిదాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.