Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెట్రో స్టేషన్ల దగ్గర సంతకాల సేకరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రోరైలులో విద్యార్థులకు రాయితీతో కూడిన పాస్‌లను జారీ చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పలు మెట్రోరైలు స్టేషన్ల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'హైదరాబాద్ మెట్రోరైల్ అతికొద్ది కాలంలోనే ప్రజలకు మంచి రవాణా సౌకర్యాన్ని అందిస్తూ ప్రజాధరణకు పొందిందన్నారు. నగరంలోని కొన్ని ప్రధాన రూట్లలో రవాణా సదుపాయం పెరిగిందన్నారు. నగరంలోని లక్షలాదిమంది విద్యార్థులకు మెట్రో రైల్ ప్రయాణాన్ని మరింత అందుబాటులో తెచ్చేందుకు రాయితీతో కూడిన మెట్రోరైల్ పాస్‌లు జారీ చేయాలని కోరారు. పాసులు జారీ చేయడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఎంతో ఉపయోగం జరుగుతుందని చెప్పారు. పేద విద్యార్థుల కోసం హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తమ సామాజిక బాధ్యతగా పాసుల జారీని ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో బస్సు పాసుల కారణంగా పేద విద్యార్థులకు చాలా మేలు జరుగుతున్నదనీ, ఇదే మాదిరిగా మెట్రో రైల్ సంస్థ కూడా పాసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వీరేందర్, ప్రశాంత్, స్టాలిన్, శివ, వాసు, తదితరులు పాల్గొన్నారు.