Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలోని మైక్రోబయాలజీ విభాగం ''రీసెర్చ్ బేస్డ్ పెడగోగికల్ టూల్స్ ఫర్ లైఫ్ సైన్సెస్ '' అనే అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌కు ఓయూలోని మైక్రోబ యాలజీ విభాగాధిపతి ప్రొ.సందీప్త బూర్గుల కన్వీనర్‌గా, మైక్రోబయాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ డాక్టర్ హమీదా, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నిజాం కళాశాల ప్రిన్సి పాల్ ప్రొ.బి.భీమా చైర్మన్‌గా ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ శాంతి కుమారి కో-కన్వీనర్లుగా ఈ కార్యక్రమాన్ని ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్, యూనివర్సిటీ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొ.ఏ బాలకిషన్, ఓయూలోని యూని వర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొ.బీ.వీరయ్య ప్రారంభించారు. ప్రభావవంతమైన అభ్యాసానికి కీలకమైన పరిశోధన ఆధారిత బోధనా సాధనాల గురించి లైఫ్ సైన్సెస్‌లో పీజీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వర్క్‌షాప్ ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు. ఉస్మానియా విశ్వవి ద్యాలయం ఉన్నత విద్యలో నాణ్యతను పరిరక్షించడంలో, అదే సమయంలో విద్యార్థుల ఉపాధిని పెంపొందించ డంలో ఏ విధంగా కృషి చేస్తుందో ప్రొ.డి రవీందర్ పాల్గొ న్న వారితో మాట్లాడారు. నేడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతుందనీ, సమాచారం అందరికీ ఉచితంగా అందుబా టులో ఉండటంతో విద్యార్థుల బోధనా అవసరాలు మారా యన్నారు. పరిశోధన ఆధారిత బోధన విద్యార్థులకు సమర్థ వంతమైన అభ్యాసానికి అత్యంత ముఖ్యమైన పరిష్కారం అనీ, ఇది విద్యార్థులకు ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడంలో సహాయపడుతుందన్నారు. సమర్థవంత మైన బోధనా వ్యూహాలను రూపొందించడానికి ఉపాధ్యా యులకు స్వాత ంత్య్రం ఇస్తుందని చెప్పారు. ఆదర్శ విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాల అభివృద్ధికి మార్గాన్ని సృష్టిస్తుంద న్నారు. వివి ధ కళాశాలల పలువురు అధ్యాపకులు, ఎంఎస్సీ ఉస్మాని యా యూనివర్శిటీలోని మైక్రోబయాలజీ విభాగంలో గ్రాండ్ ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.