Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థు లపై కేసులా? అని ఓయూ పీహెచ్డీ ఆశావహులు, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు. మంగళ వారం ఓయూ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యూని వర్సిటీ సమస్యల పుట్టగా ఉంటే విదేశీ పర్యటన అవస రమా అని ప్రశ్నించారు. శాంతియుతంగా బంద్కు పిలుపునిస్తే ప్రొఫెసర్లతో వేరే నిరసన కార్యక్రమం పెట్టడించడం వీసీ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. కుట్ర పూరితంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ఓయూ వీసీ అన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీకి వీసీగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బ్యాక్ లాగ్ ఉద్యో గాలను నింపాలని జీఓ ఇస్తే బేఖాతరు చేస్తున్న వీసీ కుట్రలో భాగంగానే విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు వీసీకి విద్యార్థులు విన్నవించినా తన మొండి వైఖరిని వీడలేదన్నారు. నిరంకుశ దోరణి సాగిస్తున్నారన్నా రు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ ఓయూ వీసీ రాజ్యాంగ విలువ లకు, రిజర్వేషన్ల లక్ష్యాలకు విరుద్దంగా పీహెచ్డి పరీక్షలు నిర్వహించారని చెప్పారు. బలహీన వర్గాలను అవకాశాలు కల్పిస్తామని సమానత్వానికి తోడ్పడటం రిజర్వేషన్ల ఉద్దేశమైతే విద్యార్థి దశలోనే అడ్డుకట్ట వేసే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 45శాతం అర్హత మార్కులు పెట్టి, ఒకే విధమైన రిజర్వేషన్ పద్దతి ఉండటం దారుణం అన్నారు. పరిశోదన విలువలు పాటించకుండా పరిశోద నా మెథడాలజీ ప్రశ్నలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వికలా ంగులకు ఒకే రిజర్వేషన్ పద్దతి పెట్టి బలహీన వర్గాలను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిఫలంగా 20శాతం విద్యార్థులు కూడా అర్హత సాదించలేని పరిస్థితిలో డిపార్టుమెంట్లలో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడి మూతపడే ప్రమాదం ఉంటదన్నారు. తక్షణమే వీసీని తొలగించాలనీ, పరిశోధక విద్యార్థులు లేకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా నష్టమే కనుక వెకెన్సీలు కూడా పెంచాలనీ, కాకతీయ యూనివర్సిటీ తరహాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కులు లేకుండా, బీసీ విద్యార్థులకు 20శాతం అర్హత మార్కులతో పీహెచ్డీ అడ్మిషన్ ప్రక్రియ జరపాలన్నారు.