Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సర్కిల్ 09 పరిధిలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝులిపించారు. పురాణాపూల్, ఘాన్సీ బజార్ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను గురువారం జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుకున్నారు. నిర్మాణా లను కూల్చివేశారు. పురాణపూల్ డివిజన్ పరిధిలో ఓ భవన నిర్మాణ దారుడు స్థానికులకు ఇబ్బంది కలిగేలా తన భవనాన్ని నిర్మిస్తుండగా సర్కిల్ 09 ఏసీపీ రాణి తన సిబ్బందితో వెళ్లి ఆ అక్రమ కట్టడాన్ని కూల్చి వేయించారు. అదే సందర్భంలో ఘాన్సీ బజార్ డివిజన్ పరిధిలోని మట్టికా షేర్, లాడ్ బజార్ పరిధిలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఏడు నిర్మాణాలను సీజ్ చేసి, వాటిలో కొన్నింటిని కూల్చి వేయించారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చూసుకుంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ టీమ్ ఇన్చార్జ్, సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ అలివేలు మంగతాయా రు, టౌన్ ప్లానింగ్ ఏసిపి లు రాణి, శ్రీహరి, రాందాస్, ఫహిమ్ సిబ్బంది శివ, అజీమ్, అబ్బాస్ అలీ, స్థానిక పోలీసుల సహాయంతో ఏడు భవనా లను సీజ్ చేశారు. వాటిలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణ చేపడితే చర్యలు తప్పమన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.