Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
అర్హులైన నిరుపేదలందరికీ ఇల్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూంలు కేటాయించాలని, స్థలం ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రజాసంఘాల పోరాట వేదిక పిలుపు మేరకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాకు తుర్కయంజాల్ మున్సిపాల్టీ నుంచి ఆర్డీవో కార్యాలయంలో అర్జీలు పెట్టుకున్న వందలాది మంది నిరుపేదలు రాగన్నగూడలోని తుర్కయంజాల్ మున్సిపాల్టీ సీఐటీయూ కార్యాలయం నుంచి సీఐటీయూ నాయకులు డీ కిషన్ ఆధ్వర్యంలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు మంచాల మాజీ జెడ్పీటీసీ పగడాల యాదయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు బోడ సామేల్, డి జగదీష్, ప్రకాష్ కారత్, రామకష్ణారెడ్డి, ముసలయ్య, పంది జంగయ్య, తుర్క యంజాల్ మున్సిపాల్టీ ప్రజాసంఘాల నాయకులు తులసి గారి నరసింహ, ఇల్లూరి భాస్కర్, కందుకూరి శారద, కొండిగారి శంకర్, మల్యాద్రి రత్నమ్మ, యాదగిరి, రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.