Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేంద్రనాథ్
నవతెలంగాణ-నాగోల్
చెత్తను ఎక్కడపడితే అక్కడ వీధులలో పారవేయ కుండా డివిజన్ ను చెత్త రహిత డివిజన్ ను గా తీర్చిదిద్దేం దుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని నాగోల్ డివిజన్ కార్పొ రటర్ చింతల అరుణ సురేంద్రనాథ్ సూచించారు. గురువారం డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సుచి- శుభ్రత అవగాహన ర్యాలీలో అరుణ సురేందర్ నాథ్ యాదవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం నివసిస్తున్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఇంటిలో ఉన్న తడి పొడి చెత్తను వీధులలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా వేరువేరుగా చేసి ఇంటి ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటోలకు వేసి డివిజన్ పరిశుభ్రతకు సహకరించాలని వారు కోరారు. పాఠశాల లు విద్యావంతులకు ఒక దేవాలయం లాంటివని అటువంటి దేవాలయాలలో చెత్త వేయకూడదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిహెచ్ఎంసి సిబ్బంది బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.