Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్ పల్లి మున్సిపాల్టీలోని 7వ వార్డు ఉస్మాన్ నగర్ కాలనీలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను బీఆర్ఎస్ జల్ పల్లి మున్సిపాల్టీ సీనియర్ నాయకులు సయ్యద్ యూసఫ్ పటేల్‌తో కలిసి 7వ వార్డు కౌన్సిలర్ మజర్ అలీ ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఇప్పటికే మంత్రి సబితా సహకారంతో కోట్లాది రూపాయల నిధులతో మున్సిపాల్టీల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రికి ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.