Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఈనెల 23న అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం పురస్కరించుకొని 2023 సంవత్సరానికి గాను ఉత్తమ సామాజిక సేవా పురస్కారానికి ఎన్ఎస్ఎస్ విభాగంలో డా.చింతల రాకేశ్ భవాని ఎంపికయ్యారు. అస్తిత్వం సంస్థ ఈ రాష్ట్రస్థాయి పురస్కారానికి ఆయనను ఎంపిక చేశారు. ఈనెల 20న హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. రాకేశ్ భవాని ప్రస్తుతం హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు కౌన్సిలర్‌గా కూడా సేవలందిస్తున్నారు. కళాశాల ఎన్.ఎస్.ఎస్ బాలుర విభాగానికి ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వంచే రంగారెడ్డి జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా సేవలందించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ క్రీడలు,యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చైర్మెన్‌గా పని చేసే ''నెహ్రూ యువకేంద్రం'' కు సలహా సంఘ సభ్యునిగా, రంగారెడ్డి జిల్లా జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా డా.రాకేశ్ భవానిని ఎన్.ఎస్.ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ రామకష్ణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సవిన్ సౌదా, సిబ్బంది, పలువురు ప్రోగ్రాం అధికారులు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోత్స్న ప్రభ, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి , అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.