Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలమండలి జనరల్ మేనేజర్‌కు కార్పొరేటర్ వినతి
నవతెలంగాణ- సరూర్‌నగర్
సరూర్‌నగర్ డివిజన్లో పలు కాలనీలలో అభివృద్ధి పనుల కోసం యూజీడీ పైప్ లైన్లను శాంక్షన్ చేయాలని కోరుతూ జలమండలి జనరల్ మేనేజర్ బలరా ంకు గురు వారం సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ కాలనీలలో పగిలిపో యిన పైపులు, డ్యామేజ్ అయిన మాన్యువల్స్ లాంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భగత్ సింగ్ నగర్, ఇంద్ర హిల్స్ ,చెరుకు తోట కాలనీ, చౌడి, బాపూనగర్, అంబేద్కర్ నగర్, లక్ష్మీ నగర్, వెంకటేశ్వర కాలనీ, శ్రీనివాస కాలనీ, ఎస్బీఐ కాలనీ, పోచమ్మబాగ్, హుడా కాలనీ, డాక్టర్స్ కాలనీ, వికాస్ నగర్ ప్రాంతాలలో రిపేర్స్‌తో పాటు కొత్త పైపులైన్ పనులు అవసరం ఉందని కోరారు. గతంలో కూడా ఇవే సమస్యలపై వినతి పత్రం అందజేశామని గుర్తు చేశారు.