Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ఆర్ఐ కేంద్ర కమిటీ సభ్యులు సదానందం, పూజార్ పిలుపు
నవతెలంగాణ-హయత్నగర్
అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్దికి కృషి చేస్తామని సీపీఐ(ఎంఎల్) ఆర్ఐ కేంద్ర కమిటీ సభ్యులు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిలు జి సదానందం, డిహెచ్ పూజార్లు తెలిపారు. సీపీఐ(ఎంఎల్) ఆర్ఐ రాష్ట్రస్థాయి సదస్సులో వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కోసం అన్ని 'మార్క్సిస్ట్ - లెనినిస్ట్' పార్టీలతో చర్చలు జరిపి ఒకే అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉండాల న్నారు. కాషాయ మనువాద కార్పొరేట్ ఫాసిస్ట్ మోడీ పాలనను ఓడించడానికి సాధ్యమైనంత విస్తృతమైన ఫాసిస్టేతర రాజకీయ ఫ్రంట్ నిర్మించడానికి కృషి చేయాల న్నారు. ఈ నెల 28న ఫాసిస్ట్ వ్యతిరేక సభ హైదరాబాద్లో నిర్వహిస్తామని, ఏఐఆర్డబ్ల్యూ రాష్ట్ర స్థాయి సదస్సు మంచిర్యాలలో మార్చి 8న నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఆర్ సంతోష్, జాడి దేవరాజ్, గూడూరు వైకుంఠం, తాటికొండ రమాదేవి, బింగి సుధాకర్, అన్వర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు టి.పూర్ణచంద్రరావు , అడ్వకేట్ మేకల అరుణ్, ఉస్మాన్ బాష, గొల్లిపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.