Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన విద్యా ర్థులతో పాటుగా మరికొంత మందిని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అదు పులోకి తీసుకుని ఎల్బీ నగర్ పోలీసులకు అప్పగించారు. ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాగోల్ వెంకటరమణ కాలనీ(స్వస్థలం సూర్యాపేట)లో నివాసం ఉంటున్న షైక్ అబ్బాస్, అదే ప్రాంతానికి చెందిన మర్యాద దినేష్ రెడ్డి(మాడ్గుల పల్లి నల్గొండ), మన్సూరాబాద్ సరస్వతీ నగర్ కాలనీకి చెందిన చెరుకు చందు(సూర్యాపేట), నల్లగొండకు చెందిన సత్తు శ్రీరామ్ చరణ్ తేజ అలియాస్ బంటి, వనస్థలిపురం ప్రగతి నగర్‌కు చెందిన ఆవుల సందీప్(నల్లగొండ), నాగోల్ వెంకటరమణ కాలనీకి చెందిన అజం పాషా (సూర్యాపేట), మంగల్ హాట్కు చెందిన సాహిల్ సింగ్, అదే ప్రాంతానికి చెందిన అభిషైక్ సింగ్ లు కలిసి నాగోల్ లో ఉన్న పేదలకు గంజాయి అమ్మకాలు చేస్తు న్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10సెల్ ఫోన్లు, 10కేజీల గంజాయి, 3వాహనాలు, రూ. 56,930నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన భూక్య శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ సీలేరుకు చెందిన రాంబాబు, ఒడిస్సాకు చెందిన ఆంజనేయులు పరారీలో ఉన్నారు.