Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన
- బీఎన్ రెడ్డి నగర్లో ఘటన
నవతెలంగాణ-హస్తినాపురం
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల గర్భిణి మృత్యువాత పడిందంటూ బంధువులు ఆందోళనకు దిగిన ఘటన బి.ఎన్ రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సాయి స్వరూప హాస్పిటల్లో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవర కొండ సమీపంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన నక్క చందన (20)కు నల్గొండ జిల్లా పి.ఈపల్లి మండలం అజ్మా పురం గ్రామానికి చెందిన హరీష్‌తో 8 నెలల క్రితం వివాహ మైంది. బీ.ఎన్ రెడ్డినగర్‌లోని టీచర్స్ కాలనీలో హరీశ్ కారు నడుపుతూ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. చందన రెండు నెలల గర్భిణి కాగా ఈ నెల 6న (సోమవారం) రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం బీఎన్ రెడ్డినగర్‌లోని సాయి స్వరూప హాస్పిటల్లో చేర్పించారు. అంతకు మును పే ఆమె రక్త హీనతతో బాధ పడటం వలన ఆమెకు రక్తం ఎక్కించారు. బుధవారం ఉదయం చందన ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎల్.బి నగర్ సమీపంలోని గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్లాలని సాయి స్వరూప వైద్యులు సూచించారు. దాంతో బాధితురాలి బంధువులు గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి చందన మరణించినట్టు ధవీకరించారు. కేవలం సాయి స్వరూప వైద్య బందం నిర్లక్ష్యం కారణంగా చందన మరణించిందని మతురాలి బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించారు.మెరుగైన వైద్య సదపాయాలు లేకున్నా బాధితులను మభ్యపెట్టి కేవలం లాభార్జనే లక్ష్యంగా ఇక్కడి వైద్యుల తీరు ఉందని, తమ దగ్గరి అత్యాధునిక వైద్య సదుపాయాలు లేకున్నా నామమాత్రపు చికిత్స అందిస్తూ ఇక్కడి యాజమాన్యం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతుందని వారు ఆరోపించారు. ముందే వేరేదైనా హాస్పిటల్ కి వెళ్తే చందన ప్రాణాలతో ఉండేదని మతురాలు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వివరణ కోసం నవతెలంగాణ ప్రతినిధి ఫోన్లో డాక్టర్ ను సంప్రదించగా వారు స్పందించకపోవడం గమనార్హం.