Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
విద్య, పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతర్జా తీయ స్థాయి నైపుణ్యాలను పరస్పరం మెరుగు పరుచు కునే దిశగా ఓయూ ముందడుగు వేసింది. జపాన్‌కు చెందిన షిబౌరా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పరస్పర అవగాహనా కుదుర్చుకుంది. ఈ మేరకు టోక్యోలోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సకురా సైన్స్ ప్రోగ్రా మ్లో పాల్గొన్న ఓయూ వీసీ ప్రొ.రవిందర్ ఒప్పందంపై సంతకం చేశారు. సంస్థ అధ్యక్షులు జన్ యమద, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ తకుమి మియోషీ ఒప్పందం పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రెండు విద్యాసంస్థల మధ్య అత్యాధునికి సంకేతిక సౌక ర్యాలు పంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు వారి విజ్ఞానం, వనరులు, అవకాశాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. సకురా సైన్స్ ప్రణాళికలో భాగంగా పది మంది ఓయూ విద్యార్థులతో పాటు వీసీ ప్రొ.రవీందర్ విద్యార్థి సంక్షేమ వ్యవహారాల డీన్ ప్రొ.రాజేంద్ర నాయక్ జపాన్‌లో పర్యటి స్తున్నారు. ఏడు రోజుల పర్యటనలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు పరస్పర చర్చా కార్యక్రమాలతో పాటు, శాస్త్ర సాంకేతిక లాబోరేటరీలు, మ్యూజియం సందర్శన, సంస్క తి సంప్రదాయాలపై మాటా మంతి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.