Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తుకారం గేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, లాలాపేట ప్రభుత్వ హాస్పిటల్లో శుక్రవారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బంది కి కనీస మౌలిక సదుపాయాలు లేవనీ, డ్రెస్సింగ్ రూమ్, బాత్ రూమ్, మంచినీరు, బోర్ వాటర్, వివిధ రోగాల బారిన పడిన రోగులకు కూడా బాత్రూం లేవని డిప్యూటీ మేయర్‌కు సమస్యలను విన్నవించుకున్నారు. సంబంధిత అధికారుల తో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని డిప్యూ టీ మేయర్ ఆదేశించారు. అందరూ కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి శంకర్, తహసీల్దార్ మాధవి, ఏంహెచ్ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, ఐసీడీఎస్ సునంద, వైద్య అధికారులు పాల్గొన్నారు.