Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళశాల ఆవరణలో శుక్రవారం డుసిమస్-2023 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ ప్రొ.డి.రాధిక యాదవ్ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇది ఒక గొప్ప వేదిక అన్నారు. విద్యార్థులు ఈ వేదిక ద్వారా వివిధ అంశాలపై సత్తాచాటుకోవాలని విద్యార్థులకు సూచించా రు. లీగల్ సెల్ సెల్ డెరైక్టర్, లా సెట్ కన్వీనర్ ప్రొ.బి. విజయ లక్ష్మీ, బషీర్ బాగ్ లా కళాశాలా ప్రిన్సిపాల్, లా విభాగం హెడ్ ప్రొ.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు డూసిమాస్ ద్వారా వివిధ న్యాయ కళాశా లాల విద్యార్థులు ఒక వేదిక ద్వారా సత్తా చాటుకుంటున్న దేశ, రాష్ట్ర సాంస్కతి, సంప్రదాయలను పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాష్ మబ్, లిట్రరి ఈవెంట్స్, వ్యాసరచన, రాంగోళి, డ్రాయింగ్, సుడుకు, ట్రెజర్ హంట్, ఫొటో గ్రాఫి, సాహిత్య పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. నగరంలో 18 న్యాయ కళాశాాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నేడు సాంస్కతిక కార్యక్రమాలు, పాటలు, డ్యాన్స్, మిమిక్రి, స్కిట్స్, ర్యాంప్ వాక్ పొటీలు నిర్వహించనున్నట్టు విద్యా ర్థులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా.రాం ప్రసాద్, డా.రత్నాకర్ రావు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.