Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్ రెడ్డి రాంరెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
గత ఎన్నికల్లో యువకులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీ ఏమైందో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పాలని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మల్రెడ్డి రాంరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలని మల్రెడ్డి రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కొక్క నిరుద్యోగ యువతీ,యువకులకు నెలకు రూ.3116/-ల చొప్పున 50నెలలకు గాను సుమారుగా 1,55,800/- రూపా యలు ఇవ్వకుండ మోసం చేసిందని అయన తెలిపారు. వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన ఎల్బీనగర్ ప్రజలను నట్టేట ముంచి అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిధుల నుంచి ఏ అభివృద్ధి పనులు చేశారో ప్రజలకు వివరించాలని అయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో హంగామా చేయడం తప్ప అభివద్ధి శూన్యం అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా జాబ్ మేళా నిర్వహించిన సుధీర్‌రెడ్డి ఎంతమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారో తెలపాలని డిమాండ్ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్న సుధీర్‌రెడ్డి ఎంతమంది నియోజకవర్గ ప్రజలకు అందులో ఉపాధి కల్పించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు తీసుకురాలేకపోతు న్నాడో, నిరుద్యోగ భృతి ఎందుకు అందించలేకపోతున్నాడో ప్రజలకు వివరించాలని మల్ రెడ్డి రాంరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి కోసం టీిఆర్ఎస్కి వెళ్లానన్న సుధీర్ రెడ్డి ఎవరి అభివృద్ధి కోసం వెళ్లాడో నియోజకవర్గ ప్రజలకు తెలిసి పోయిందన్నారు.