Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ లోని అల్మాస్‌గూడలో ఉన్న గ్రీన్ జోన్ సమస్యను పారిష్కారం చేయాలని కోరుతూ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రంశేఖర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి కలెక్టర్ హరీష్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా గ్రీన్ జోన్ సమస్య పరిష్కారం కోసం విద్యా శాఖ సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, కాలనీవాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.