Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజీఎం హేమంబార్
నవతెలంగాణ- సరూర్నగర్
వివిధ రాష్ట్రాల్లో ఆటవికుల జీవన విధానం, వారి స్థితిగతులపై అవగాహన కల్పించే విధంగా చిన్నారులు వేసిన నాటకము, వేషధారణ ఎంతో ఆకట్టుకున్నాయని నారాయణ పాఠశాల ఏజీఎం హేమంబార్, ఆర్ఐ రవిప్రసాద్ అన్నారు. 'భారత జంబూద్వీప మహోత్సవం' కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రకృతి మమేకమై, జీవజాతులను తమతో సమానంగా భావించి ఆటవికుల జీవన పరిస్థితులు కళ్ళకు కట్టే విధంగా చిన్నారులు చేసిన ప్రదర్శన ఎంతో ఆకట్టుకుందన్నారు. తమ పాఠశాలలో సంస్కృతికి, సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిప్రసాద్, ఏఓ రాధ, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.