Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరేందర్ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని టీిపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎల్మెటి అమరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కొత్తపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీపీసీసీ కార్యదర్శి ఎల్మేటి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే పేద ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కొత్తపేట గ్రామస్తులు, లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, మల్లేష్, చాంద్ పాషా, కృష్ణ, భువనేశ్వర్ గోవర్ధన్, శ్రీనివాస్, ఆనంద్, కిరణ్, శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్ హిబామ్, వంగేటి మధు సూధన్‌రెడ్డి, ఆంజనేయులు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.