Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ స్థలాలకు యజమానులు ప్రహరీ గోడ నిర్మించాలి
- ఖాళీ స్థలాలపై వేకెంట్ పన్ను వసూలుచేసే పధ్ధతి నెలకొల్పాలి
- ఆయా కాలనీల సంక్షేమ సంఘం నాయకుల ఆవేదన
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని కాలనీలో కాలనీ సంక్షేమ సంఘాలు సమైక్యంగా కాలనీలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్న తరుణంలో ఖాళీ స్థలాల యజమానులు తక్షణం తమ తమ స్ధలాలలో నిర్మాణాలు చేస్తే మంచిదని, ఆ ఖాళీ స్థలానికి చుట్టూరా కాంపౌండ్ వాల్ నిర్మించుకుని, చెత్తచెదారం వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే చెత్తాచెదారంతో పాటు పందికొక్కులు, పాములు, కుక్కలు చేరి అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని కాలనీ సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలో ఇలా వందలాది ఖాళీ జాగాలలో బాధ్యత లేనివారు తమ తమ ఇళ్ళల్లోని చెత్తను వాటిలో వేయటం జరుగుతోంది. ఇరువైపులవారికి పందికొక్కులు, ఎలుకలు, పాములు చేరడంతో ఇతర కీటకాల వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేకెంట్ పన్ను వసూలుచేసే పధ్ధతి నెలకొల్పాలి
మహానగరాలయిన బెంగుళూరు, చెన్నై లాంటి చోట్ల వేకెంట్ పన్ను వసూలుచేసే పధ్ధతి వుంది. ఇది ఒక రకంగా మంచిదేమో కూడ కాకపోతే చట్టం చేసో లేక నోటీసు ఇచ్చో చేయాలి. ఇలా ఖాళీ స్థలాలు సంవత్సరాల కాలంగ వుండటం వలన ఆయా కాలనీలలో అభివృద్ధి పనులకు కావలసిన అంటే రోడ్లు, వాటర్ లైనులు, డ్రైనేజీ పైపులు వేయటానికి అక్కడ వున్న తక్కువ మంది మీద అదనపు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాయని, మొదటి ప్లాటు తర్వాత నాలుగు ప్లాట్లు ఖాళీ ఆ చివరి వారు వుంటే ఈ పొడుగు లైన్ వేస్తేనే కానీ ఆ చివరి వారికి నీరు రాదు. మురుగునీటి సౌకర్యం రాదుకదా, పోనీ ఆ తర్వాత ఆ స్ధలాలలో నిర్మాణం చేసినా అప్పటి కే వేసిన రోడ్డు, వున్న పైపులకు కలపడానికైనా రోడ్ కటింగు చేయడం తప్పదని కాలనీ సంక్షేమ సంఘాలు నాయకులు అంటున్నారు.
వనస్థలిపురం డబుల్ రోడ్ పక్కన గల కాలనీ వారి రెస్పాన్స్
డబుల్ రోడ్ పక్కన 3 ఖాళీ స్థలాల వల్ల నరకం చూసాను. వాటి యజమానులతో కాంపౌండ్ వాల్ కట్టించాను. ఇప్పుడు హాయిగా ఉందని ఆ కాలనీ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. గతంలో సోమేష్ కుమార్, మునిసిపల్ అడ్మిన్ సెక్రటరీగా వున్నపుడు చెన్నై, బెంగుళూరు నగరాలలో లాగ వేకెంట్ ట్యాక్సు ప్రపోస్ చేయమని లేఖ రాస్తే సంబంధిత కింద స్థాయి అధికారులకు ఆయన తెలియచేయటం జరిగిందని శారదా నగర్ కాలనీ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. ఇలాగే స్ధలాలపై పెట్టుబడి పెట్టే వారికి కాలనీ నివాసుల బాధ తెలియటంలేదని, గతంలో 200 రూపాయలు గజం చొప్పున కొని నేడు కనిష్ఠం 60వేలు గజానికి అమ్మటం జరుగుతుందని, ఆ పక్కనే వున్న వారు ఆ ఖాళీ స్ధల యజమానుల వలన పడే బాధ అంతా ఇంతా కాదని, మునిసిపల్ శాఖమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి సంవత్సరానికి కనీసం 200 గజం చొప్పున ట్యాక్స్ వసూలు చేసేలా చట్టం చెయ్యాలని, ఆ డబ్బుతో ఆ కాలనీలో స్వచ్ఛ పారిశుధ్య కార్యక్రమం నిర్వహణ చేయవచ్చునని కాలనీ సంక్షేమ సంఘాలు తమ ఆవేదనతో కూడిన ఆలోచన వెల్లడించారు.