Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
డివిజన్ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడతామని ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేతమధుకర్ రెడ్డి అన్నారు. ఆదివారం డివిజన్లోని పూర్ణోదయ కాలనీలో పర్యటించి, కాలనీవాసులతో చర్చించి వారికి కావాల్సిన అభివృద్ధి పనులను తెలుసుకొని సంబంధిత అధికారులకు వెంటనే అభివృద్ధి పనులను ప్రారంభించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కార్పొరేటర్ కోరారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ మెంబర్స్ శ్రీధర్ రెడ్డి, అమ్రేష్ రెడ్డి, శశిధర్ మరియు బీజేపీ నాయకులు మధుకర్‌రెడ్డి, వీరేంద్రబాబు, అమర్నాథ్రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శరత్చంద్ర, వెంకట్ రెడ్డి, విశాల్, అజరు తదితరులు పాల్గొన్నారు.