Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
రాష్ట్రంలో తెలంగాణ సర్కారు అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు కేవలం వారి కార్యకర్తల కోసమే కానీ పేద ప్రజలకోసం ఏ మాత్రం కాదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అన్నారు. బి.ఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఆటో స్టాండ్ వద్ద రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు ప్రజాగోస - బీజేపీ భరోసా కార్యక్రమాన్ని స్ధానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అప్రజాస్వామిక నిర్ణయా లను బీజేపీ ఎప్పటికప్పుడు ఎండగడుతుందని, రానున్న రోజుల్లో గడీల పాలనకు చరమగీతం పాడేలా కార్యాచరణ వుంటుందని వారు అన్నారు. కార్పొరేటర్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ డివిజన్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి, అభివృద్ధికి కృషిచేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మరియు డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొంతం నవ కిషోర్ రెడ్డితోపాటు సీనియర్ నాయకులు, కాలనీల అధ్యక్షులు, కార్యకర్తలు అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.