Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలనీల్లోని సమస్యలు పట్టింపు లేదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ-ఉప్పల్
ఏ కాలనీలో చూసినా కొత్తగా చేసిన అభివృద్ధి లేదు.. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి.. సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం నగరాన్ని డల్లాస్ చేస్తాం అంటున్నారు. నగరాభివృద్ధి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అంటున్నారు.. అసలు కేటాయించిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అంటూ కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, మేకల శివారెడ్డిలు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదు డివిజన్లలలో హాత్ సే హాత్ జోడో యాత్రలో పలు సమస్యలు ప్రజలు విన్నవించారు. జోడో యాత్రలో గుర్తించిన సమస్యలను సోమవారం ఉప్పల్ సర్కిల్ మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికైనా అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలను నిర్మాణం చేయాలని కోరారు. అనంతరం వాటర్ వర్క్స్ అధికారులను కలిసి కలుషిత జలాల సరఫరా, మురుగు సమస్యలను గురించి వివరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. కార్యక్రమంలో సుర్వి మురళిగౌడ్ ఆకారపు అరుణ్ పటేల్, మరియు చిలకనగర్ డివిజన్ అధ్యక్షుడు కొంపల్లి బాలరాజు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తవిడబోయిన గిరిబాబు, ఈగ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.