Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎల్బీనగర్
దిల్సుఖ్నగర్ క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర క్యాలెండర్ ప్రజాసంఘాలు కేవీపీఎస్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్షౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంకాల సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు గంధం మనోహర్ మాట్లాడుతూ క్షౌర వృత్తిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీిఐటీయూ జిల్లా నాయకులు మల్లెపాక వీరయ్య, ప్రజా సంఘాల నాయకులు సీిహెచ్ వెంకన్న, గిరిజన సంఘం జిల్లా నాయకులు గోపి నాయక్, నాయిబ్రాహ్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొలనుకొండ అశోక్, చైతన్యపురి డివిజన్ నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు చందు తదితరులు పాల్గొన్నారు.