Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర నాయకులు చెవ్వ శ్రవణ్
నవతెలంగాణ-మీర్పేట్
జిల్లెలగూడ రెవెన్యూ పరిధిలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ దళిత మోర్చ రాష్ట్ర నాయకులు చెవ్వ శ్రవణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, మీర్పేట్ మున్సిపల్ కమిషనర్, బాలాపూర్ తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బాలాపూర్ మండలం జిల్లెలగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 124లో 5ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. దాంట్లో కొంతభాగం మున్సిపల్ కార్యాలయానికి కేటాయిం చారు. మిగిలిన భూమిని కొందరు భూ కబ్జాదారులు పక్క సర్వే నెంబర్‌తో తప్పుడు పత్రాలు సష్టించి కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని అన్నారు. గతంలో అదే స్థలంలో నిర్మాణాలు చేపడితే మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ఆ నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. మళ్లీ అదే స్థలంలో నిర్మాణాలు చేస్తుంటే అధికారులు తమకేమీ తెలియద న్నట్లుగా చూసీచూడనట్లు వ్యవరించడాన్ని తప్పుపట్టారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీ నాయకులకు అండగా ఉండటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిరుపతిరెడ్డి, ముఖేష్ యాదవ్, స్వామి, రాజేంద్రసాగర్ తదితరులు పాల్గొన్నారు.