Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే దేవి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ-సంతోష్‌నగర్
దుర్గా భవాని నగర్ కాలనీ పరిధిలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం చంపాపేట్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే పాదయాత్రలో భాగంగా దుర్గాభవాని నగర్ కాలనీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకట్, నిషాకాంత్, నాగేశ్వరరావు, జగన్, నరసింహ, రవీందర్‌రెడ్డి, యాదగిరి రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, ప్రభాకర్, సాయిలు, కిషోర్, రాహుల్, బద్రి, రామకృష్ణారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మోహన్ రెడ్డి, రత్నారావు, సురేంద్రరెడ్డితో కలిసి శంకుస్థాపన పనులు ప్రారంభిం చారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్య వల్ల తలెత్తిన సమస్యను స్థానికుల విజ్ఞప్తి మేరకు పరిశీలించి సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రతివాడలో మురుగునీరు మరమ్మతులు డ్రైనేజీ ప్రవాహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రంగా తీసుకోవలసిన చర్యలపై అధికారులకు చర్చించడం జరిగింద న్నారు. మొదటిసారిగా వేసిన భూగర్భ డ్రైనేజీ పూర్తిగా దెబ్బతింది, ప్రస్తుతం 4 అడుగులు ఉండడం వలన జనాభా పెరుగుదల అనుసారంగా 8 అడుగులకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. సమస్య పరిష్కారానికి 100 ఫీట్ పొడవున కొత్త డ్రైనేజీ వ్యవస్థకు కలపాని సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, సీసీ రోడ్డు, మంచినీరు, విద్యుత్ దీపాలు, వంటి అన్ని రకాల మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన చెప్పారు. కాలనీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూనని, మెరుగైన ప్రజా జీవనాన్ని అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, కాలనీని ఆదర్శవంతమైన డిబి నగర్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.